“ఆచార్య” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 29, 2021 3:44 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం మొదలవుతున్న సినిమా షూటింగులతో ఈ చిత్రం కూడా ఒకటి.

ఆల్ మోస్ట్ ఒక 15 రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంచుకున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా బజ్ వినిపిస్తుంది. వచ్చే జూలై రెండో వారంలో దానిపై క్లారిటీ కానీ లేదా అప్పుడే రిలీజ్ కానీ ఉండొచ్చట.

మరి ఈ సాంగ్ చరణ్ మరియు పూజా హెగ్డేలపై డిజైన్ చేసింది కావడం పైగా మణిశర్మ తన మార్క్ మెలోడీ నెంబర్ ను ఇచ్చారని సినీ వర్గాల్లో టాక్ ఉండడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ సమయానికే ఈ సాంగ్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :