బన్నీ ఒక్క హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ?

Published on May 21, 2020 11:50 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఎర్ర చందనం స్మగ్లింగ్ బేస్డ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ బజ్ వినిపిస్తుంది. బన్నీకు ఎలాగో నార్త్ లో మంచి క్రేజ్ ఉంది దీనితో హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకుంటారని తెలిసింది.

కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమిళ్,మలయాళం, కన్నడ భాషల్లో కూడా తానే డబ్ చెప్పే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే ఇతర భాషల్లో ఈ సినిమాపై మరింత ఇంపాక్ట్ కలిగించడం ఖాయం అని చెప్పాలి. బన్నీ మరియు సుక్కుల నుంచి వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబోకు వీరి ఆల్ టైం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More