బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 22, 2026 7:00 AM IST

Koratala Siva

నందమూరి నటసింహం బాలకృష్ణ మన సీనియర్ హీరోస్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ 112వ సినిమాని పాపులర్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిని కూడా భారీ స్కేల్ లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు వచ్చే వారమే ఉంటాయని తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుందట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దేవర మేకర్స్ యువసుధ ఆర్ట్స్ వారితో ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు