అభిమానుల సమక్షంలో ‘భరత్ అనే నేను’ టీజర్ ?
Published on Feb 24, 2018 6:55 pm IST

తెలుగు పరిశ్రమలో త్వరలో విడుదలకానున్న భారీ సినిమాల్లో మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ కూడ ఒకటి. మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ను తీసిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్ర టీజర్ ను ఉగాదికి విడుదలచేయనున్నారని టాక్ నడుస్తుండగా ఇప్పుడు ఈ విడుదల అభిమానుల సమక్షంలో జరిగే అవకాశాలున్నాయని కూడ అంటున్నారు.

మరి ఈ వార్త నిజమో కాదో, లేకపోతే నిర్మాతల డైరీలో వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ చేస్తున్న మహేష్ అండ్ టీమ్ కొత్త షెడ్యూల్ కోసం త్వరలోనే లండన్ వెళ్లనున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook