చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 15, 2021 3:01 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా శంకర్ తో ప్లాన్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

అలాగే దీనిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా తెలుసు. అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ వచ్చిన నాటి నుంచి అనేక రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలా లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ కు చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లే వినిపిస్తున్నాయి కానీ ఆమె రోల్ పరంగా టాక్ వినిపిస్తుంది.

ఫిమేల్ లీడ్ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ రోల్ లో ఉంటుంది అని టాక్. ఇప్పటికే ఈ చిత్రం ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది అన్న విషయం కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. మరి శంకర్ చరణ్ తో ఎలాంటి ప్లాన్ గీస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :