మెగాస్టార్ నెక్స్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 26, 2021 12:34 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం మెగాస్టార్ మంచి లైనప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయితే వాటిలో రెండు రీమేక్స్ ఉండగా ఆ రెండిట్లో మొదటగా మళయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ను స్టార్ట్ చెయ్యనున్నారని తెలిసింది.

అయితే ఈ చిరు ఆచార్య తర్వాత చేయనున్న సినిమాపై మరింత బజ్ ఇపుడు వినిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ ఆచార్య కంప్లీట్ కాబడిన కొన్ని వారాల్లోనే స్టార్ట్ చేసేయనున్నారట. అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను స్టార్ హీరోయిన్ నయనతార కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే థమన్ మ్యూజిక్ వర్క్స్ కూడా కొంత మేర పూర్తి చేయగా దర్శకుడు మోహన రాజా స్క్రిప్ట్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :