మెగాస్టార్ “లూసిఫర్” రీమేక్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 31, 2021 7:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం లైన్ లో ఉండగానే రెండు క్రేజీ రీమేక్ చిత్రాలను ఓకే చేసారు. అయితే వాటిలో మొట్ట మొదటగా ఆచార్య కంప్లీట్ అయ్యిన వెంటనే స్టార్ట్ చేసేది మాత్రం “లూసిఫర్” రీమేక్ మాత్రమే.

ఈ భారీ చిత్రం ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్న థమన్ నిన్ననే చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమా పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ ముగింపు దశలో ఉన్నాయట. ఇప్పటికే మార్పులు చేర్పులతో దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసినట్టు టాక్ ఉంది. మరి ఈ చిత్రం ఏ నెల నుంచి మొదలు కానుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :