రాజమౌళి మల్టీ స్టారర్ పై కొత్త వార్త !
Published on Mar 14, 2018 12:05 pm IST


దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లతో చేయనున్న మల్టీస్టారర్ సినిమా పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో తార స్థాయి అంచనాలున్నాయి. చరణ్, తారక్ లు అన్నదమ్ములుగా కనిపిస్తారని చెప్పబడుతున్న ఈ సినిమా సోషల్ సబ్జెక్ట్ గా ఉంటుందట.

మొదట్లో ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుడుతూ నా గత సినిమాల్లోలా ఇందులో భారీ స్థాయి గ్రాఫిక్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. దీంతో అందరూ జక్కన్న ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెళ్లరని అనుకున్నారు. కానీ తాజా సమాచారం మేరకు ఇందులో కూడా గ్రాఫిక్స్ ఉంటాయట. కానీ భారీ స్థాయిలో ఉండవని ఒక మోస్తారుగా మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత మాత్రం వాస్తవముందో తేలాలంటే రాజమౌళి నుండి సమగ్ర సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook