చరణ్ సినిమాపై మరో కొత్త పుకారు

చరణ్ సినిమాపై మరో కొత్త పుకారు

Published on Mar 22, 2020 7:35 PM IST

Ram Charan 2

రామ్ చరణ్ తర్వాతి సినిమా ఏమిటనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇతనితోనే అంటూ రోజుకో దర్శకుడి పేరు తెరపైకి వస్తోంది. మొన్నటివరకు సుకుమార్, విక్రమ్ కుమార్ పేర్లు జోరుగా వినబడగా ఇప్పుడు సుజీత్ పేరు తెర మీదికి వచ్చింది. సుజీత్ చరణ్ కోసం ఒక కథను రాసుకుని, ఆయనకు వినిపించారని, చరణ్ సైతం కొన్ని మార్పులు సూచించారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఇవన్నీ కేవలం సుజీత్ తన ఇన్స్టా అకౌంట్లో చరణ్, అలియా భట్ ఇద్దరినీ ఫాలో కావడం స్టార్ట్ చేశారు. అందుకే ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేనా ఇందులో అలియా భట్ కథానాయికగా నటించనుందని కూడా అంటున్నారు. ఇలాంటి రూమర్లు ఆగాలంటే చెర్రీ త్వరగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటైల్స్ రివీల్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పూర్తవడానికి చాలా సమయం ఉంది. ఈలోపు చాలామంది దర్శకులు ఖాళీ అవుతారు. కాబట్టి ఇప్పుడే చరణ్ పలానా దర్శకుడితో వర్క్ చేస్తారని చెప్పడం కష్టం.

తాజా వార్తలు