“RRR” బ్యాలన్స్ షూట్ లో ఈ సాంగ్స్ కూడా ఉన్నాయా.?

“RRR” బ్యాలన్స్ షూట్ లో ఈ సాంగ్స్ కూడా ఉన్నాయా.?

Published on May 29, 2021 7:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఇప్పటికే చాలా మేర షూట్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రం త్వరలోనే బ్యాలన్స్ షూట్ కూడా పునఃప్రారంభం కానివ్వనుంది. అయితే ఇపుడు ఈ బ్యాలన్స్ షూట్ పైనే లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ టాక్ ప్రకారం ఇది వరకే చరణ్ మరియు ఆలియా ల నడుమ ప్లాన్ చేసిన ఒక రొమాంటిక్ నెంబర్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది.

అయితే మరి వీరిద్దరి కాంబోలో ఒక్క పాట ఉందా రెండు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఇదే కాకుండా ఇద్దరు హీరోల నడుమ కూడా ప్లాన్ చేసిన సాంగ్ షూట్ కూడా ఉందని తెలుస్తుంది కానీ దానిపై సరైన సమాచారం తెలియరాలేదు. ఇక ఈ భారీ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు