సూర్య 38వ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు ?
Published on Mar 15, 2018 3:50 am IST

తమిళ స్టార్ హీరో సూర్య తన 36వ సినిమా ‘ఎన్.జి.కె’ చిత్రాన్ని ఇంకా ముగించకముందే ఆయన 38వ సినిమా గురించిన చర్చలు మొదలైపోయాయి. ఇప్పటికే 37వ చిత్రాన్ని కెవి. ఆనంద్ దర్శకత్వంలో చేస్తారని కన్ఫర్మ్ కాగా 38వ సినిమాను దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తారని కూడ అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. సుధా కొంగర గతంలో తమిళంలో ‘ఇరుద్ది సుట్రు’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించి దాన్నే తెలుగులో వెంకటేష్ తో ‘గురు’గా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.

 
Like us on Facebook