“వకీల్ సాబ్” ట్రైలర్ వచ్చేది అప్పుడేనా.?

Published on Mar 23, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” రిలీజ్ కు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో మేకర్స్ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు పాటలకు భారీ రెస్పాన్స్ ను ఈ చిత్రం అందుకుంది. దీనితో సినిమా రిలీజ్ అయ్యే లోపు ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను మేకర్స్ వచ్చే మార్చ్ 29న విడుదల చేయనున్నాని తెలుస్తుంది. అలాగే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే నివేత థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9న భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :