రాజమౌళి సినిమా విడుదలైన రోజునే ‘విజేత’ విడుదల !
Published on Jun 13, 2018 1:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ చిత్రం ‘విజేత’ ఆఖరి దశ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈయన చిత్రాన్ని జూలై 6వ తేదీన విడుదలచేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే జూలై 6నాడే రాజమౌళి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఈగ’ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆ సెంటిమెంట్ ప్రకారమే ఆయన అదే రోజున ‘విజేత’ను విడుదలచేయాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఈ నెల 24న మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో జరగనుంది. నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. ఇటీవలే విడుదలై చిత్ర టీజర్ కూడ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook