లేటెస్ట్ క్లిక్స్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ‘అల్లు అర్జున్’

లేటెస్ట్ క్లిక్స్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ‘అల్లు అర్జున్’

Published on Sep 28, 2023 10:30 PM IST

AA

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 (ది రూల్) మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తరచు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన పర్సనల్ లైఫ్ తో పాటు సినీ కెరీర్ గురించి పలు విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం లండన్ లో ఉన్న అల్లు అర్జున్, అక్కడ స్టైలిష్ సూట్ లో దిగిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AA1

తాజా వార్తలు