ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ హీరోయిన్.. నిజమేనా ?

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ హీరోయిన్.. నిజమేనా ?

Published on May 25, 2025 1:00 PM IST

spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ మూవీలో త్రిప్తి దిమ్రిని తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అని పోస్టులు చేస్తున్నారు. డార్లింగ్‌తో ఆమెకు కెమిస్ట్రీ సెట్ కాదని.. మృణాల్, శ్రద్ధా కపూర్ అయితే బాగుండేదని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు