అనుకున్న వారికే “వకీల్ సాబ్” స్ట్రీమింగ్..మరిన్ని డీటెయిల్స్.!

Published on Feb 28, 2021 9:33 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఆ మధ్యన ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు భారీ ఆఫర్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి రాగా దానిని నిర్మాత దిల్ రాజు తిరస్కరించారు. అయితే ఇప్పుడు వారే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసారని తెలుస్తుంది. ఇంతకు ముందు దిల్ రాజు అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకుంటారని తెలిసిందే అలా దీనికి కూడా జరిగింది.

కానీ సాటిలైట్ హక్కులు మాత్రం జీ తెలుగు వారికి చెందాయి. అయితే మరో టాక్ ఏమిటంటే ఈ చిత్రాన్ని 50 రోజులు పూర్తి అయ్యే వరకు కూడా స్ట్రీమింగ్ లో రిలీజ్ చెయ్యకూడదని కూడా డీల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :