బన్నీ మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గాసిప్!

Published on Nov 29, 2020 11:00 am IST

తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” అనే సాలిడ్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇది ఇంకా లైన్ లో ఉండగానే బన్నీ మరో సంచలన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసాడు. అదే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో, ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో దానిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంపై కొన్ని ఆసక్తికర గాసిప్ వినిపిస్తుంది. అదే అల్లు అర్జున్ రోల్ కు సంబంధించి. ఈ చిత్రంలో బన్నీ ఒక స్టూడెంట్ లీడర్ గా ఫస్ట్ హాఫ్ లోను అలాగే సెకండ్ హాఫ్ లో ఒక పొలిటిషయన్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కొరటాల పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. మరి ఇవి ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More