శంకర్ “ఇండియన్ 2” ఇష్యూ పై లేటెస్ట్ ప్రోగ్రెస్.!

Published on Jun 30, 2021 3:00 pm IST

గత కొంతకాలం నుంచి కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఇండియన్ 2″(భారతీయుడు 2) విషయంలో దర్శకుడు శంకర్ మరియు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నడుమ వాగ్వాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడు కోర్టులో ఉన్న ఈ కేసుపై ఎలాంటి తీర్పు ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే మరి లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ కేసుపై లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏంటో వినిపిస్తుంది. మరి దాని ప్రకారం తమిళనాడు హై కోర్టు ఇండియన్ 2 ఇష్యు పై మాజీ సుప్రీం జడ్జి ఆర్ పనుమతిని మధ్య వర్తిగా నియమించారట. మరి వారు స్టేట్మెంట్ అనంతరమే ఈ చిత్రం సమస్య పై ఒక తుది క్లారిటీ రానుంది అని తెలుస్తుంది. మరి అదెప్పుడు వస్తుందో అన్న దానిపై ఇంకా లేదు.

సంబంధిత సమాచారం :