వైరల్ గా మారిన టీనేజ్ నాని ఫోటో..!

Published on May 23, 2020 12:11 am IST

హీరో నాని తన అక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెవుతూ ఓ త్రో బ్యాక్ పిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇప్పుడు ఆఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో నాని నిక్కర్ వేసుకుని, అప్పుడే మొలుస్తున్న మీసాలతో సన్నగా ఉన్నాడు. పక్కనే తన అక్క దీప్తీ కూడా ఉంది. అప్పటికి నాని ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఫొటో వైరల్‌గా మారింది.

ఇక నాని నటించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ విడుదల కానుండగా నాని సీరియల్ కిల్లర్ రోల్ చేయడం విశేషం. అలాగే దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ అనే మరో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో నాని నటిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఆయన మరో మూవీకి సైన్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More