‘ఓజి 2’ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్!

‘ఓజి 2’ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Jun 6, 2026 5:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సెన్సేషన్ గా నిలిచిన రీసెంట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ‘ఓజి’ అనే చెప్పాలి. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిక్స్డ్ టాక్ తో కూడా 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడం తర్వాత పవన్ నుంచి కూడా ముందే గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓజి 2 పై అంచనాలు ఇప్పుడు పీక్స్ లో ఉన్నాయి.

ఇక దీని తర్వాత సుజీత్ నాచురల్ స్టార్ నానితో సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది కానీ అది ఇంకా మొదలు కాలేదు. కానీ ఈ గ్యాప్ లో సుజీత్ ఓజి 2 లో కూడా బిజీగా ఉన్నాడట. ఆల్రెడీ నాని సినిమాకి అంతా సెట్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ గ్యాప్ లో ఓజి స్క్రిప్ట్ ని తాను లాక్ చేసేసినట్టు తెలుస్తుంది. ఓజి 2 స్క్రిప్ట్ లాక్ చేయడమే కాకుండా వీలు చూసుకొని పవన్ కి కథ నరేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా టాక్. సో ఈ క్రేజీ బజ్ పవన్ ఫ్యాన్స్ కి నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు