సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి కాంబో నుంచి సెట్టయిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో భారీ స్థాయిలో హైప్ సెట్టయ్యింది. అయితే ఇప్పుడప్పుడే పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందో లేదో కానీ మేకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
మరి ఇప్పుడు కూడా మహేష్ తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దీనితో షూట్ మొదలు కానుండగా మహేష్ ఈ షూట్ ట్రైనింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారిక హాసిని వారు భారీ బడ్జెట్ తో సుమారు 200 కోట్ల వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


