ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రమే ‘వారణాసి'(Varanasi) కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ లెవెల్లోనే మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ కి ఏడాది సమయం ఉన్నప్పటికీ గ్లోబల్ వైడ్ గా సాలిడ్ ప్రమోషన్స్ ని చేసుకుంటుంది.
అయితే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. వీటి ప్రకారం మేకర్స్ ముందుగా వి ఎఫ్ ఎక్స్ పనులు శరవేగంగా అవ్వగొట్టే పనుల్లో ఉన్నారట. వీటికి పెద్ద పీట వేస్తూ టాకీ పార్ట్ ని నిదానంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ వి ఎఫ్ ఎక్స్ పనులు మాత్రం ఎక్కువే పూర్తయ్యాయి అని తెలుస్తుంది.
వీటిని అనుగుణంగా మహేష్, పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా లపై సన్నివేశాలు తెరకెక్కిస్తారట. మరి వి ఎఫ్ ఎక్స్ విషయంలో జక్కన్న ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదట. బడ్జెట్ లో అధిక శాతం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే వినియోగిస్తున్నట్టు టాక్. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.
