మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో వెంకీ మామ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సాలిడ్ పాన్ ఇండియా యాక్షన్ సబ్జెక్టు “సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ తో కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఓ 16 రోజుల క్రేజీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారట.
మరి ఇందులో పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎపిసోడ్ లు అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ ని కూడా తెరకెక్కించినట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు.. ఇక నెక్స్ట్ కొన్ని కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.
