ఆకట్టుకుంటున్న శ్రీముఖి తో మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఇంటర్వ్యూ ప్రోమో

ఆకట్టుకుంటున్న శ్రీముఖి తో మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఇంటర్వ్యూ ప్రోమో

Published on Sep 24, 2022 1:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లుసిఫర్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ఈ చిత్రం లో నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను మెగాస్టార్ ఒక్క చిన్న డైలాగ్ తో షురూ చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి తో ఇంటర్వ్యూ ను ప్లాన్ చేయడం జరిగింది. తాజాగా విడుదల అయిన ఇంటర్వ్యూ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు