మజిలీ మరియు చిత్రలహరి తాజా వసూళ్లు.!

Published on Apr 19, 2019 8:20 am IST

శివ నిర్యాణ దర్శకత్వంలో నాగచైతన్య మరియు సమంత ప్రధానపాత్రధారుగా తెరకెక్కిన్న ఎమోషనల్ రొమాంటిక్ చిత్రం మజిలీ.మొదటి షో నుంచే మంచి వసూళ్లను అందుకున్న ఈ చిత్రం 13 రోజులు గడిచే సరికి తెలుగు రాష్ట్రాల్లో కాస్త నెమ్మదించింది.తాజాగా కృష్ణ జిల్లాలో ఈ చిత్రానికి 14వ రోజున 1.06 లక్షల షేర్ రాబట్టింది.దీనితో కృష్ణ జిల్లాలో మజిలీ ఇప్పటివరకు 1.70 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక అలాగే చాలా కాలం గ్యాప్ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ కు కూడా “చిత్రలహరి”తో మంచి విజయం దొరికింది.కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కూడా మొదటి ఆట నుంచి మంచి టాక్ రావడంతో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఈ సినిమా విడుదలై వారం కావస్తుండడంతో కృష్ణాలో 7వ రోజు 1.55 లక్షల షేర్ ను రాబట్టింది.అక్కడ మొత్తం 7 రోజుల్లో ఈ సినిమా 71.29 లక్షల షేర్ ను ఇప్పటి వరకు రాబట్టింది.నాని నటించిన జెర్సీ సినిమా కూడా వారం గ్యాప్ లోనే విడుదల కావడంతో చిత్రలహరి వసూళ్లపై ప్రభావం పడేందుకు అవకాశం ఉంది.ప్రస్తుతానికి అయితే ఈ రెండు చిత్రాల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :