సీనియర్ దర్శకుడి చేతులమీదుగా “లాస్ట్ సీన్”.. !

Published on Jun 9, 2019 10:04 pm IST

హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం “లాస్ట్ సీన్”. ఈ చిత్రం ట్రైలర్ ని హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డిగారి చేతులమీదుగా విడుదల అయింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ… ‘ట్రైలర్ బాగుంది. ఈ చిత్రం దీపక్ కి మంచి పేరు తీసుకురావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. దర్శకుడు దీపక్ భల్దేవ్ ఠాకూర్ మాట్లాడుతూ… “లాస్ట్ సీన్” ఈ చిత్రం నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. నేను ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, ఊటీలలో షూటింగ్ జరుపుకుంది. అందరూ వాళ్ళ సొంత సినిమాలా కష్టపడి పనిచేసారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More