భారీ ధరకు అమ్ముడైన “భీమ్లా నాయక్” ఆడియో రైట్స్!

Published on Aug 30, 2021 12:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయి ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కి సిద్దం గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. 5.04 కోట్ల రూపాయల తో ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో రానా దగ్గుపాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :