అందుకే ‘మహర్షి’ టీజర్ అలా కట్ చేశాం !

Published on Apr 10, 2019 10:10 am IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదుల చేసిన టీజర్ కూడా ఆ అంచనాలకు రెట్టింపు చేసింది. ఇక టీజర్ లో, సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు వేరియేషన్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్తగా, స్టూడెంట్ గా మరియు ఒక కామెన్ మెన్ గా మహేష్ కనిపించి అలరించారు.

కాగా ఈ గెటప్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడని విషయం తెలియజేయడానికే టీజర్ ను అలా కట్ చెయ్యడం జరిగింది అని తెలిపారు.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :