‘కుమారి 21 ఎఫ్’ అనే ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ యంగ్ బ్యూటీ. ఆ సినిమా హిట్ కారణంగా హెబ్బాకు ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చాయి.
కానీ ఆ తరువాత వరుస ప్లాప్ లతో ఈ అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. దాంతో వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతుంది. లాస్ట్ సినిమా ’24 కిస్సెస్’లో తన బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బా ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.
అయితే తాజాగా హెబ్బా మరో బోల్డ్ మూవీలో మరో బోల్డ్ క్యారెక్టర్ ను అంగీకరించింది. సుశాంత్ రెడ్డి అనే దర్శకుడు దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాడికల్’ చిత్రంలో హెబ్బా నటిస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లో త్వరలోనే షూట్ కు వెళ్లనుంది.
