భారీ ధరకు అమ్ముడైన కాంచన 3 థియేట్రికల్ హక్కులు !

Published on Mar 16, 2019 11:17 pm IST

యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం కాంచన 3. సూపర్ హిట్ హార్రర్ థ్రిల్లర్ ముని సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఈచిత్రంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసిరీస్ లో వచ్చిన కాంచన , గంగ చిత్రాలు తెలుగు లోకూడా సూపర్ హిట్ అవ్వడం తో ఈ కాంచన 3 కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు 12కోట్లకు సొంతం చేసుకున్నారని సమాచారం.

రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకం ఫై రాఘవ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం తో పాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More