అభిమానుల ఆశలు నెరవేరేలా కనిపించట్లేదుగా !

Published on Feb 4, 2019 4:20 pm IST

భారీ హిట్ కోసం ఈ సారి భారీగానే కసరత్తులు చేసి ‘మిస్టర్ మజ్ను’తో వచ్చాడు అక్కినేని అఖిల్. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ ఆ అంచనాలను తలక్రిందుల చేస్తూ.. మిక్సడ్ రివ్యూస్ కే పరిమితమైంది. దాంతో కలెక్షన్స్ రాబడటంలోనూ ఈ చిత్రం వెనుక పడిపోయింది. 20 కోట్లు బిజినెస్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 11 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో అఖిల్ కెరీర్ లో మరో పరాజయంగా నిలిచింది మిస్టర్ మజ్ను చిత్రం.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ వారం కలెక్షన్స్ ను చూస్తే ఇక వారి ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు. పాపం అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎంత ట్రే చేసినా .. ఆ హిట్ మాత్రం అఖిల్ కి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. మరి తరువాత చేయబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :