ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓన్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏకంగా రూ.140 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది.
ఎంతైనా కొరటాల ఈ దేవర కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.


