రానా, విహికాల పెళ్లి డేట్ ఫిక్స్ చేశారా?

రానా, విహికాల పెళ్లి డేట్ ఫిక్స్ చేశారా?

Published on May 31, 2020 9:02 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరిగా ఉన్న రానా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రేమిస్తున్న తన ప్రేయసి మిహికా బజాజ్ ను ఆయన పెళ్లి చేసుకొన్నారు. కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా వేడుక కూడా జరుపుకున్నారు. ఇక వీరి పెళ్లి వేడుక వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ రానా తండ్రి సురేష్ బాబు ఆలోచనలో ఉండగా, ఆగస్టులో రానా విహికా పెళ్లి ఉండే సూచనలు కలవని తెలుస్తుంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు సురేష్ బాబు మొదలుపెట్టారట. ఆగస్టులో ఈ జంటను ఒక్కటి చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారట. గతంలో వీరి వివాహం డిసెంబర్ లో ఉండే సూచనలు కలవు అని భావించగా అంతకంటే ముందే వీరి వివాహం ఉండనుంది అనేది తాజాగా వినిపిస్తున్న మాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు