లేటెస్ట్ : తొలిసారిగా నిర్మాత దిల్ రాజు ఇన్స్టాగ్రామ్ లైవ్ … డీటెయిల్స్ ఇవే

Published on Mar 10, 2023 9:00 pm IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ తో కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా మరొక నూతన సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి దాని పై బలగం మూవీ నిర్మించి మరొక సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం ఆడియన్స్ యొక్క ఆదరణ తో కొనసాగుతోంది.

అయితే విషయం ఏమిటంటే, ఫస్ట్ టైం దిల్ రాజు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆడియన్స్ ముందుకి లైవ్ కార్యక్రమం ద్వారా రానున్నారు. అలానే ఆ లైవ్ లో బలగంతో పాటు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఇతర ప్రాజక్ట్స్ గురించి కూడా పలు ఆసక్తివర విశేషాలు అందించనున్నారు దిల్ రాజు. ఇక ఆయన రేపు, అనగా మార్చి 11 సాయంత్రం 5 గంటల నుండి దిల్ రాజు ప్రొడక్షన్స్, థైవ్యూ వారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా లైవ్ లో ఆడియన్స్ ముందుకి రానున్నారు.

సంబంధిత సమాచారం :