వర్మ “వ్యూహం” టీజర్ కి డేట్, టైం ఫిక్స్.!

వర్మ “వ్యూహం” టీజర్ కి డేట్, టైం ఫిక్స్.!

Published on Jun 23, 2023 10:00 AM IST

vyuham

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలం నుంచి పలు కాంట్రవర్సియల్ సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా పొలిటికల్ గా అయితే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఆ తరహా సినిమాలే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. మరి అలా లేటెస్ట్ గానే తాను అనౌన్స్ చేసిన మరో చిత్రమే “వ్యూహం” కాగా ఈ చిత్రం కూడా ఏపీ రాజకీయాలకి సంబంధించిన నేపథ్యంలోనే తెరకెక్కించబడింది.

ఇక ఈ సినిమాపై వర్మ మార్క్ బజ్ అయితే ఉండగా ఇపుడు లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ కి వర్మ డేట్ అండ్ టైం ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా టీజర్ రేపు జూలై 24 ఉదయం 11 గంటలకి అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పోస్టర్ తో ఈ అనౌన్సమెంట్ అందించారు. ఇక ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా అయితే అజ్మల్ అమీర్ నటిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ టీజర్ వచ్చాక అయితే వర్మ ఎలాంటి సెన్సేషన్ సెట్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు