“బాలయ్య 109” పై సాలిడ్ అప్డేట్..!

“బాలయ్య 109” పై సాలిడ్ అప్డేట్..!

Published on Jun 16, 2024 10:56 AM IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ తన 109వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా బాబీ డియోల్ సహా యంగ్ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొంత కాలం బ్రేక్ తీసుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సాలిడ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా దాదాపు అక్టోబర్ 10 రిలీజ్ కే మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇక షూటింగ్ కూడా ఓవరాల్ గా నెలన్నర మాత్రమే బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బాలయ్య బాబీ డియోల్, దుల్కర్ కాంబినేషన్ సన్నివేశాలు కూడా తక్కువ రోజుల్లోనే ఫినిష్ అయిపోతుంది అని తెలుస్తుంది.

మొత్తానికి అయితే బాలయ్య 109 అదిరే అవుట్ పుట్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు