ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ షాక్ ఇవ్వడుకదా?

Published on May 23, 2020 12:58 am IST

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీపై వార్తలు వస్తున్న నాటి నుండి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ప్రశాంత్ నీల్ ట్వీట్ దీనిపై స్పష్ట ఇవ్వడంతో వారు ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. ఐతే కన్నడ పరిశ్రమలో ఈ ప్రాజెక్ట్ కారణంగా చెలరేగిన నిరసనల కారణంగా ఆయన వెనక్కి తగ్గరేమో అనిపిస్తుంది. అందుకు ఆయన తాజా వ్యాఖ్యలు ఊతం ఇస్తున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. నాకు ఇంత పేరు రావడానికి కారణం కన్నడ ఇండస్ట్రీ కన్నడ ప్రజలు. నా డీ.ఎన్.ఏ లోనే కన్నడ ఉంది. ఇప్పటికిప్పుడు నా తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పలేను. ఎందుకుంటే నా ఫోకస్ అంతా ‘కేజీఎఫ్’ చాప్టర్2 పైనే ఉంది. కానీ ఒక్కటి చెప్పగలను, నా తదుపరి చిత్రాలన్నీ కన్నడలోనే ఉంటాయని చెప్పుకొచ్చాడట. ఈ స్టేట్మెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డైలమాలో పడేసింది. అంతా లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ నీల్ తాజా వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More