టాక్..యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేది అప్పుడేనా..?

టాక్..యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యేది అప్పుడేనా..?

Published on Oct 27, 2022 7:03 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “కేజీయఫ్” ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా వైడ్ ఎనలేని క్రేజ్ ని అయితే తాను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అయితే యష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో నెక్స్ట్ దర్శకుడు శంకర్ తో చేయనున్నాడని గట్టి టాక్ వినిపిస్తూ వచ్చింది.

మరి ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా మరో టాక్ వినిపిస్తుంది. బహుశా ఈ చిత్రం అయితే వచ్చే ఏడాది జనవరిలో అనౌన్స్ చేసే అవకాశం ఉందట. మరి అప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ నుంచే అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని అయితే తమిళ భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బిగ్గెస్ట్ కాంబో పై అయితే మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు