“అఖండ” టోటల్ బిజినెస్ భారీ ఫిగర్ దగ్గర ఆగిందా.?

Published on Jun 30, 2021 6:58 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని తెలియడమే కాకుండా ఈ సినిమా బిజినెస్ కూడా బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా జరుగుతుంది అని ఇప్పుడు తెలుస్తుంది.

అయితే మొన్ననే హిందీ హక్కులు భారీ మొత్తంలో 15 కోట్లకి అమ్ముడు పోయాయని తెలియగా ఇప్పుడు మొత్తం బిజినెస్ ఫిగర్ పై బజ్ వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు, ఓవర్సీస్ సహా మన దగ్గర ఇతర భాషల థియేట్రికల్ అలాగే తెలుగు నాన్ థియేట్రికల్ హక్కులు కలుపుకొని దాదాపు 100 కోట్ల ఫిగర్ ను బాలయ్య టచ్ చేసేసారట. మరి ఈ సినిమాపై ఉన్న స్వింగ్ కి అంత మొత్తాన్ని కూడా థియేటర్స్ నుంచి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మరి బాలయ్య రోర్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :