‘మా’ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా ?

Published on Apr 16, 2019 6:10 pm IST

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు నెల రోజుల క్రితం శివాజీరాజీ – నరేష్‌ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఆ పోటీలో మా అధ్యక్షుడిగా నరేశ్‌‌ శివాజీ రాజా పై 69 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నరేష్ తో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో రాజశేఖర్ విన్ అయ్యారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి గెలిచారు.

కాగా ఇప్పుడు మళ్లీ ‘మా’లో లొల్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ‘మా’లో నిధులు విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని దాంతో వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి రాజీనామా చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తను మాత్రం మా సభ్యులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం :