‘కల్కి’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 22, 2019 2:35 am IST

‘గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం నుండి ఇటీవలే ఫస్ట్ అవతార్ టీజర్ విడుదలై నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ నెల మూడో వారం నుండి చిత్రబృందం లాంగ్ షెడ్యూల్ ను జరుపుకొనుంది. ఈ షెడ్యూల్ లో రాజశేఖర్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.

ఇక ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :