ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి అట !

Published on Aug 16, 2018 10:10 am IST

జ్యోతిక ప్రధాన పాత్రలో బాల దర్శకత్వంలో రాబోతున్న అనువాద చిత్రం ‘ఝాన్సీ’. డి.అభిరాం, కోనేరు కల్పన ‘కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ పతాకాల’ పై సంయుక్తంగా రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు కల్పన మీడియాతో మాట్లాడుతూ ‘జ్యోతిక పోలీసు ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. దర్శకుడు బాల ఎంతో రీసెర్చ్ చేసి ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాల్ని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో ఈ చిత్రంలో చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి అని తెలిపారు.

కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా యువ నటుడు జి వి ప్రకాష్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మరి రేపు విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుందో చూడాలి. అలాగే తాజాగా జ్యోతిక నటిస్తోన్న మరో చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ కీలకమైన పాత్రను పోషిస్తుండగా తమిళ్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More