అఖిల్ 4 కోసం భారీ కాంబినేషన్ !

అఖిల్ 4 కోసం భారీ కాంబినేషన్ !

Published on Nov 26, 2018 8:46 AM IST


అక్కినేని యువ హీరో అఖిల్ మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తున్నాడు. దాంట్లో భాగంగా తన కొత్త చిత్రాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన నటించనున్న నాల్గవ చిత్రం ఫై చిత్ర వర్గాల నుండి ఆసక్తికర సమాచారం వస్తుంది. ఈచిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

ఇక అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసి అఖిల్ తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు