‘బాలయ్య – బోయపాటి’ సినిమాలో కొత్త మార్పులు !

Published on Nov 22, 2020 5:08 pm IST

నందమూరి బాలకృష్ణకు సింహాతో ప్లాప్స్ నుండి రిలీఫ్ కలిగించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. హిట్ లేక డీలా పడ్డ నట సింహానికి హిట్ ఇచ్చి.. సినిమాల్లో బాలయ్యకు మళ్ళీ మార్కెట్ తెచ్చిన ఘనత బోయపాటిదే. కాగా ఈ మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో బాలయ్య ప్రస్తుతం ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ లో లేటెస్ట్ గా కొన్ని మార్పులు చేశారు. సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. ఇప్పుడు ఒక హీరోయిన్ తాలూకు పార్ట్ ను తీసేసారని సమాచారం. అలాగే సాంగ్స్ ను కూడా తగ్గించారట. రెండు సాంగ్స్ తొలిగించారు. కరోనా రావడం, షూటింగ్ పోస్ట్ ఫోన్ అవ్వడంతో బోయపాటి మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఈ మార్పులు చేశారు.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, అఘోరా పాత్ర అని సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి అఘోరా నేపథ్యం లేదని, కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారు. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More