మార్చి 10న విడుదలకానున్న ‘కాలా’ టీజర్ ?
Published on Feb 20, 2018 3:11 pm IST

త్వరలో విడుదలకానున్న చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ కూడ ఒకటి. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా పై అభిమానులు, ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలున్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ కథలో రజనీ లోకల్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందన దక్కించుకోగా ఇప్పుడు టీజర్ ను సిద్ధం చేస్తున్నారు టీమ్.

మార్చి 10న ఈ టీజర్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ తేదీపై ఖచ్చితమైన క్లారిటీ రావాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. నానా పటేకర్, హుమా ఖురేషి, సముతిరఖని వంటి నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలచేయనున్నారు. రజనీ అల్లుడు ధనుష్ తన వండర్ బార్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పా.రంజిత్ డైరెక్ట్ చేశారు. దీని తరవాత శంకర్, రజనీల ‘2 పాయింట్ 0’ విడుదలకానుంది.

 
Like us on Facebook