“మహేష్ 28” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 10, 2023 7:30 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్న భారీ చిత్రం కోసం తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఈ చిత్రం 28వ సినిమాగా చేస్తుండగా దీనిపై అనేక అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఓ మాసివ్ ఫస్ట్ షెడ్యూల్ ని భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కంప్లీట్ చేయగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి అయితే మధ్యలో కొన్ని అనుకోని పరిస్థితులు మరింత దూరం చేసాయి.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా అప్డేట్ తెలుస్తుంది. మేకర్స్ అయితే రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి ఈ జనవరి 18 డేట్ ఫిక్స్ చేసుకున్నారట. ఇక ఇక్కడ నుంచి లాంగ్ షెడ్యూల్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాని అయితే చినబాబు నిర్మాణం వహిస్తుండగా దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ కెరీర్ లోనే ఈ సినిమాని భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :