వారిలో మహేష్ సరసన నటించేది ఎవరో ?

Published on Apr 10, 2020 1:00 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కథానాయకురాలిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. అలాగే కీర్తి సురేష్ నటించబోతుందని, ఆ తరువాత కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాల రూమర్స్ వినిపిస్తుంన్నాయి. ఇంతకీ సూపర్ స్టార్ పక్కన నటించే ఆ హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ లేదు. సారా, కీర్తి, కియారాలలో, మహేష్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట. అన్ని కుదిరితే అక్టోబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం :