మెగాస్టార్ – కొరటాల సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

మెగాస్టార్ – కొరటాల సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 7, 2018 8:20 AM IST


డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ప్రస్తుతం కొరటాల తన తర్వాత సినిమాను, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటు కొరటాల నుండి గాని, అటు మెగా క్యాంపు నుండి గాని ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందట.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తీ అయ్యాక చిరంజీవి – కొరటాల శివ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు