‘కూలీ’ చిత్రంలో స్టైలిష్ విలన్‌గా మెప్పించిన అక్కినేని నాగార్జున, ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైలురాయి చిత్రం షూటింగ్ సైలెంట్‌గా, శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ మైసూర్లో ఒక లెంగ్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకుంది.
ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ 2026, మార్చి 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ, చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్స్ను వెల్లడించలేదు. ఈ సైలెన్స్ అక్కినేని అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలను, ఆసక్తిని పెంచుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టబు మరియు సుస్మితా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.
