నితిన్ “రాబిన్‌హుడ్‌” పై లేటెస్ట్ అప్డేట్!

నితిన్ “రాబిన్‌హుడ్‌” పై లేటెస్ట్ అప్డేట్!

Published on Jul 4, 2024 3:00 AM IST

టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్‌ (Robinhood). ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చిత్ర యూనిట్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో నైట్ టైమ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు